శ్రీకాకుళం పాతబస్టాండ్ : జనగణన–2027లో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు htt ps://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రక్రియను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజూ కనీసం 10 నుంచి 20 మంది వ్యక్తులు స్వీయ గణన చేసుకునేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 26న జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలలో ‘సెన్స స్ 5కేరన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రి య పూర్తిగా స్వచ్ఛందమైనదని స్పష్టం చేశారు.
ఆదిత్యుని సన్నిధిలో మహాలింగార్చన
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలోని అనివెట్టి మండపంలో మాస శివరాత్రి సందర్భంగా బుధవారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ అర్చనాభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు.
ఖైదీలకు న్యాయ సహాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జైళ్లలో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల హక్కులను కాపాడటంతో పాటు వారికి సత్వర న్యాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసు, ఎకై ్సజ్ అధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా బెయిల్ లభించినా బయటకు రాలేకపోతున్న వారు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ముద్దాయిల కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తూ.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి హరిబాబు, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ఎస్.డి.పి.ఓ వి.వెంకటప్పరావు, అదనపు ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.నాగభూషణ రావు, జైలు అధికారులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ వర్సిటీలో ఎంఓయూ
ఎచ్చెర్ల: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన టార్చ్ ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, స్వయం సాధన కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందిస్తారు. భారత ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈ విభాగం ద్వారా నిధులు సమకూరుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, టార్చ్ ఫిన్‌టెక్ డైరెక్టర్ వైభవ్ సీపాన, అధ్యాపకులు పాల్గొన్నారు.


