● ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి గ్రామానికి చెందిన తిప్పన రాజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు 990 సాధించిటాపర్‌గా నిలిచాడు. ఎం.తోటూరు ఆదిత్యా విద్యా సంస్థల్లో చదువుతున్న రాజు కంప్యూటర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
● శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ సెకెండియర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య విద్యార్థులు కంచరాపు రేవంత్‌కుమార్, మూల సాత్విక, వడ్డి మురళీకృష్ణ 989 మార్కులతో సత్తాచాటారు. నారాయణ కాలేజ్‌కు చెందిన కొత్తకోట ఉజ్వల 988 మార్కులతో మెరిసింది. సీనియర్ బైపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య కాలేజ్‌కు చెందిన పెడగోపు బిందుమాధవి 990 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఫస్టియర్ ఎంపీసీలో శ్రీకాకుళానికి చెందిన ఎం.సౌందర్యలహరి 470 మార్కులకుగాను 467 మార్కులు సాధించింది. పొడుగు ప్రణీల, వంక జనీష, ఎస్.లక్ష్మిచేతన్, చిట్టి షణ్ముకసాయి, బైరి హస్మిత, పొలుమూరు శ్యామ్‌కృష్ణ, గుడ్ల హిమజ, గున్ను నేహ, లిస మహంతి 466 మార్కులు, దుంగ లిఖిత, అల్లాడ ఉర్షిత 465 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీలో 455 మార్కులకుగాను శ్రీకాకుళం నగరానికి చెందిన లిమ్మక లక్ష్మిత, పప్పల హర్షిత 451 మార్కులతో జిల్లా టాపర్లగా నిలిచారు. పైడిపెద్ది గిరి మేఘన 449, డి.భార్గవి 445 మార్కులు సాధించారు. వీరంతా స్థానిక శ్రీచైతన్య, నారాయణ కాలేజ్ విద్యార్థులే.
● జలుమూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని పాగోటి మౌనిక ద్వితీయ సంవత్సరం బైపీసీలో 990 మార్కులు సాధించింది. తల్లిదండ్రు లు రమణమ్మ, అశోక్ కుమార్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే.
● బూర్జ: ఓప్పివాడ ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకెండియర్ చదువుతున్న చింతాడ అనన్యశ్రీ 990 మార్కులతో సత్తాచాటింది.


