శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

నరసన్నపేట: జర్నలిస్టుగా సామాజిక అంశాలపై అవగాహన ఉన్న వైఎస్సార్‌ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి ప్రజల ఇబ్బందులను సోషల్‌మీడియా ద్వారా బయటపెడుతుంటే, దానిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ బుధవారం తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మారు వేషాల్లో వచ్చి పోలీసులు ఎత్తుకుపోవడం దారుణమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు నిబందనల మేరకు ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చి విచారణ జరపాలని, పోలీసులు ఆ నిబంధనను తుంగలోకి తొక్కి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరిని వెంటనే విడిచిపెట్టాలన్నారు.

అక్రమ అరెస్టు అన్యాయం...

టెక్కలి: వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు ప్రభు త్వం చేస్తున్న అక్రమాలను మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్న ప్రతినిధులపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement