శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటాయి. 25 కేజీబీవీల నుంచి 772 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 678 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది.పొందూరులో 97.30, గారలో 97.22, సారవకోటలో 96.7, పోలాకిలో 96.55, కొత్తూరులో 96.4 3, ఆమదాలవలసలో 95.45, కవిటిలో 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మందసలో 54.84, ఎల్లంపేటలో 42.86, ఇచ్ఛాపురంలో 73.53, పాతపట్నంలో 71.43 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పలు కేజీబీవీల్లో 970 మార్కులకు పైగా సాధించి ప్రతిభ చాటుకున్నారు. విద్యార్థినులతో పాటు ప్రిన్సిపాళ్లను, పీజీటీలను ఏపీసీ వేణుగోపాలరావు అభినందించారు. ఆమదాలవలస కేజీబీవీ విద్యార్థిని జె.వనజాక్షి ఎంపీసీలో 983 మార్కులు సాధించి కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది.


