కాశీబుగ్గ డీఎస్పీగా భవాని బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కాశీబుగ్గ డీఎస్పీగా భవాని బాధ్యతల స్వీకరణ

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

పలాస/శ్రీకాకుళం క్రైమ్‌: కాశీబుగ్గ డీఎస్పీగా టి.భవాని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత పోటీపరీక్షలు రాసి కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దారుగా కొలువు సాధించారు. తాజాగా గ్రూప్‌–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై కాశీబుగ్గలో నియమితులయ్యారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని బుధవారం డీఎస్పీ భవాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ ఆమెకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement