యంత్రం.. పనిచేసే మంత్రం | - | Sakshi
Sakshi News home page

యంత్రం.. పనిచేసే మంత్రం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన పరికరాలు

జిల్లాలో అగ్ని మాపక వారోత్సవాలు

మన జిల్లాలో లేనివి

మల్టీ పర్పస్‌ వాటర్‌ ట్రెండింగ్‌ (విశాఖ) పదివేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ బౌజర్స్‌, ఎనిమిది వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ లారీలు, బహుళ అంతస్థుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అవసరమైన హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫామ్‌ స్నారికల్‌ లేడర్స్‌ (విశాఖపట్నం, విజయవాడల్లో) ఉన్నాయి.

వాటర్‌ టెండరింగ్‌ ఫైర్‌ ఇంజిన్‌

నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఎలక్ట్రిక్‌ రిమోట్‌ సాయంతో ఆపరేటర్‌ చేస్తారు. ఆయిల్‌ ప్రమాదాలకు ఫోమ్‌ మేకింగ్‌ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్‌ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలో వాటర్‌ స్ప్రే చేయొచ్చు. 40.6 అడుగుల పొడవున్న అల్యూమినియం ఎక్సటెన్షన్‌ ల్యాడర్‌(నిచ్చెన) ఉంటుంది, సింగిల్‌ యూనిట్‌ అయితే 16, డబుల్‌ యూనిట్‌ అయితే 32 మంది ఉంటారు.

అడ్వాన్స్‌ (మల్టీపర్పస్‌) వాటర్‌ టెండరింగ్‌ ఫైర్‌ ఇంజిన్‌

నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్‌ ట్రెండింగ్‌ ఇంజిన్‌లో కిందనుంచి వాటర్‌ ప్రెజర్‌ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్‌ పట్టుకుని వాటర్‌ కొట్టవచ్చు. ఫోమ్‌, కార్బన్‌డైయాకై ్సడ్‌ ఉంటుంది. దీని ద్వారా ఫైర్‌ను కట్‌ చేయొచ్చు.

మిస్ట్‌ జీప్‌

ఇది కాన్వాయ్‌లో ఉపయోగపడుతుంది. మినీ ఫైర్‌ ఇంజిన్‌ అని కూడా అంటారు. 200 లీటర్ల నీటి సామర్థ్యం ఉంటుంది. మిస్ట్‌ గన్‌తో ఫైర్‌ను కట్‌ చేస్తారు. ఈ గన్‌ నుంచి వెలువడే ఒక నీటి బిందువు అనేక మిల్లీ మైక్రాన్‌ అణువులుగా ఏర్పడి మంటలను ఆర్పుతుంది. చిన్న చిన్న సందుల్లోంచి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.

ట్రూప్‌ క్యారియర్‌

ప్రమాదం సంభవించే ప్రాంతానికి అప్పటికప్పుడు సిబ్బంది వెళ్లేందుకు ప్రయాణంలో ఉపయోగపడేదే ట్రూప్‌ క్యారియర్‌. 30 మంది సిబ్బంది ఇందులో వెళ్లవచ్చు.

ఫైర్‌ బుల్లెట్‌ బైక్‌

ఇదికూడా ఇరుకై న సందుల్లోంచి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. 10 లీటర్ల ఫోమ్‌తో కూడిన నీళ్లుంటాయి. రెండు సిలిండర్లు ఉంటాయి. గ్యాస్‌ లీకై నప్పుడు త్వరగా ఫైర్‌ కటింగ్‌ అవుతుంది. ఆయిల్‌ ఫైర్‌ అయినప్పుడు ఫోమ్‌ ఉపయోగపడుతుంది.

ఎలక్ట్రానిక్‌ బేస్‌ అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్‌ ఇంజిన్‌

జిల్లాలోని సోంపేట, నరసన్నపేటలకు అధునాతన ఎలక్ట్రానిక్‌ బేస్‌ అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్‌ ఇంజిన్లు కొత్తగా రెండు వచ్చాయి. వీటి నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సుదూర బహుళ ప్రయోజన నాజి ల్‌తో కూడిన కొత్త అధునాతన వాటర్‌ టెండర్‌ ఇంజిన్‌ ఇది. బోట్లు, ఇతర పరికరాలు ఉన్నాయి.

వాటర్‌ టెండరింగ్‌ ఫైర్‌ ఇంజిన్‌

జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శకటాలు, అధునాతన పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వేర్వేరు ప్రమాదాలు జరిగినప్పుడు వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వీటిపై అవగాహన తప్పనిసరి. – శ్రీకాకుళం క్రైమ్‌

Advertisement
 
Advertisement
Advertisement