ఫేక్‌ ప్రచారంపై వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ప్రచారంపై వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

నరసన్నపేట: బాపు బొమ్మ స్పీక్‌ అనే ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతా ఉంచి ఫేక్‌ స్క్రీన్‌ షాట్‌ సృష్టించి.. అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిందని కొందరు ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని, పార్టీ అభివృద్ధిని ఓర్వలేకే కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆరంగి మురళి, నాయకులు కరిమి రాజేశ్వరరావు, ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, చింతు రాఘవరావు, సురంగి నర్శింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఫేక్‌ స్క్రీన్‌ ప్రచారాన్ని తప్పుపట్టారు. దీనికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు నరసన్నపేట ఎస్సై బి.గణేష్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట సోషల్‌ మీడియా ప్రతినిధులు పి.రమణ, రామకుమార్‌, అరవిందు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement