శ్రీకాకుళం పాతబస్టాండ్ : నగరంలోని ఎస్సీ హాస్టల్ –2 (భీమ్ భవన్ హాస్టల్)కు యూనియన్ బ్యాంక్ యాజమాన్యం మంగళవారం రూ.30 వేలు విలువైన 15 ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్లను అందజేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు మెరుగైన వసతులు సమకూర్చేందుకు గాను బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోలక కృష్ణమోహన్ విజ్ఞప్తి మేరకు, హాస్టల్ విద్యార్థులకు వేసవి ఎండల తీవ్రత దష్ట్యా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు యూనియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ శ్రీకాకుళం రీజినల్ హెడ్ పైడి రాజా, లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఈటీఐ మేనేజర్ రాంజీ, ఏఐబీఓసి రీజనల్ సెక్రటరీ తేజేశ్వరరావు, బ్యాంకర్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ మజ్జి రాజశేఖర్, అసోసియేషన్ లీడర్ ధనరాజు, అసోసియేషన్ జోనల్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు అనిల్ సూర్య కిరణ్, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీర రమేష్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.


