స్టేషన్‌లో గంటల తరబడి ఉంచుతారా..? | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌లో గంటల తరబడి ఉంచుతారా..?

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

స్టేషన్‌లో గంటల తరబడి ఉంచుతారా..?

ఆమదాలవలస: మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌పై పోలీసుల లాఠీచార్జి చేయడం, నోటీసులు ఇచ్చి స్టేషన్లకు తరించడం సరికాదని వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నా రు. పోలీసులు పార్టీ క్యాడర్‌కు, కొంతమంది కార్యకర్తలకు నోటీసులు జారీ చేసి సోమవారం 10 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాలని చెప్పారని, స్టేషన్‌కు వెళ్తే గంటల తరబడి ఉంచేయడం సరికాదని అన్నారు. కక్ష కట్టి నేరస్తులుగా చూడడం పోలీసులకు తగదన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వారిలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, దన్నాన అజయ్‌, దుంపల శ్యామలరావు,పొడుగు శ్రీనివాసరావు, రామ్మోహన్‌ తోపాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement