పోలీసువారి శిక్ష | - | Sakshi
Sakshi News home page

పోలీసువారి శిక్ష

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

కుక్కలు.. భౌబోయ్‌కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడులకు దిగుతున్నాయి. –8లో పోలీసువారి శిక్ష ● టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత ● పోలీసుల నోటీసులతో టెక్కలి పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ● విచారణ పేరుతో గంటల తరబడి స్టేషన్‌లోనే ఉంచేసిన వైనం ● పెద్ద ఎత్తున నిరసనకు దిగిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ● తిలక్‌ భార్య భార్గవితో కలిసి రోడ్డు డివైడర్‌పై నిరీక్షించిన ధర్మాన కృష్ణదాస్‌, నాయకులు మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ఆయనగారి కక్ష..

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
కుక్కలు.. భౌబోయ్‌కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడులకు దిగుతున్నాయి. –8లో
● టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత ● పోలీసుల నోటీసులతో టెక్కలి పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ● విచారణ పేరుతో గంటల తరబడి స్టేషన్‌లోనే ఉంచేసిన వైనం ● పెద్ద ఎత్తున నిరసనకు దిగిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ● తిలక్‌ భార్య భార్గవితో కలిసి రోడ్డు డివైడర్‌పై నిరీక్షించిన ధర్మాన కృష్ణదాస్‌, నాయకులు

ఇదో రకం కక్ష.. ఖాకీలతో ఓ ఖద్దరు చొక్కా వేయించిన శిక్ష. తెగువ చూపినందుకు, నిజాలు చెప్పినందుకు విపక్ష నాయకులపై జరిగిన వివక్ష. ధిక్కార గళాన్ని వినలేక, తనపై జరిగిన తిరుగుబాటును తట్టుకోలేక పెద్ద నేత చేయించిన రాజ్యాంగ హననానికి టెక్కలి పోలీస్‌స్టేషన్‌ వేదికై ంది. నోటీసులు ఇవ్వడం, స్టేషన్‌కు రప్పించడం, సాయంత్రం వరకు అక్కడే ఉంచడం వంటి ఉద్దేశపూర్వక చర్యలతో రాజకీయం బట్టబయలైంది. జిల్లాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలవుతోందని స్పష్టమైంది.

టెక్కలి/టెక్కలి రూరల్‌:

టెక్కలి పోలీస్‌స్టేషన్‌ రాజకీయ డ్రామాకు వేదికై ంది. మహానేత వైఎస్సార్‌ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో టెక్కలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంపై పోలీసులు ఇచ్చిన నోటీసులను గౌరవిస్తూ వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ సోమవారం టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. అయితే విచారణ పేరుతో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు తిలక్‌ను బయటకు వదలకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులంతా నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కట్టడి చేయడానికి ముందస్తు ప్లాన్‌ ప్రకారం.. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల తో పాటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వా ణి, నందిగాం ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్ముర్తి, కోటబొ మ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, పార్టీ మండల అధ్యక్షులు హెచ్‌.వెంకటేశ్వర్రావు, ఎస్‌.హేమసుందర రాజు, టి.ఫల్గుణరావు, నాయకులు సత్తారు సత్యం, తమ్మన్నగారి కిరణ్‌, చిన్ని జోగారావు, ఆట్ల రాహుల్‌ , పోలాకి లక్ష్మి, రాములమ్మ, యర్ర చక్రవర్తి, కె.అజయ్‌, కోత సతీష్‌తో పాటు టెక్కలి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలంతా మండుటెండలో నడిరోడ్డుపై బైఠాయించి తిలక్‌ను విడిచిపెట్టాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను నెట్టివేసే చర్యలకు దిగారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌, పార్టీ ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు చింతాడ రవికుమార్‌, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు టెక్కలి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని తిలక్‌ను కలిసే ప్రయత్నం చేయగా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో స్టేషన్‌ బయట తిలక్‌ భార్య నందిగాం జెడ్పీటీసీ పేరాడ భార్గవితో కలిసి డివైడర్‌పై నిరీక్షించారు. అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత తిలక్‌ను విడిచిపెట్టడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలంతా నినాదా లు చేస్తూ టెక్కలి పార్టీ కార్యాలయానికి చేరుకున్నా రు. మీడియాను సైతం స్టేషన్‌ ఆవరణకు అనుమతించకుండా ఆంక్షలు విధించారు.

తిలక్‌కు మద్దతుగా పలాస నియోజకవర్గం పరిశీలకుడు ఎన్ని ధనుంజయ్‌, నాయకులు ఎం.బైరాగినాయుడు, నర్తు నరేంద్ర, ఆరంగి మురళి, మామిడి శ్రీకాంత్‌, జి.గురునాధ్‌ యాదవ్‌, కె.బాలకృష్ణారావు, కె.కృష్ణారావు, పి.రమేష్‌, ఆర్‌.ఉమామల్లేశ్వర్రావు, ఎన్‌.సత్యరాజ్‌, ఎం.అశోక్‌, కె.నారాయ ణ మూర్తి, కె.జీవన్‌, బి.రాజేష్‌, జి.మోహన్‌రెడ్డి, వి.శ్రీధర్‌రెడ్డి, జె.తిరుమలరెడ్డి, కె.సంజీవ్‌, బి.వెంకటరమణ, బి.కూర్మారావు, జి.సోమేష్‌, డి.రామకృష్ణారెడ్డి, ఎన్‌.సాబతో, బి.కార్తీక్‌, జె.జయరాం, డి. లోకేశ్వర్‌రెడ్డి, బి.కామరాజు, పి.వెంకట్రావు, బి.రాకేష్‌, ఎ.విష్ణు, కె.కామేష్‌, ఎస్‌.జనార్ధన్‌రెడ్డి, ఎస్‌.వినోద్‌, బి.దివాకర్‌, పి.మోహన్‌,టి.విమల, ఆర్‌.కూర్మారావు, ఎ.లోకనాధం, ఆర్‌.జయమోహన్‌, ఎస్‌.సుధాకర్‌, ఎం.నాగభూషణ్‌, మాధవరావు, డి.నీలకఠం, బి.మోహన్‌, నరేష్‌, లెనిన్‌, బి.ఉదయ్‌, కె.రామరాజు తదితరులు నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement