ఘనంగా ఆదిత్యుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

ఘనంగా ఆదిత్యుని కల్యాణం డిజిటల్‌ జనగణనకు శ్రీకారం

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సంద ర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి ఆగమశా స్త్రం ప్రకారం కల్యాణ సేవను అర్చకులు పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా వేదమంత్రో చ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించారు.

శ్రీకాకుళం : జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న జనగణన– 27లో డిజిటల్‌ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ వివరాలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌, జనగణన నగర ఇన్‌చార్జి కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వారు సూచించిన మేరకు ఓ లింకును డౌన్‌లోడ్‌ చేసుకుని కుటుంబ యజమాని ఆధార్‌ కార్డ్‌ నంబర్‌, సెల్‌ నంబర్‌తో నమోదు కావచ్చని తెలిపారు. అందులో పొందుపరిచిన 31 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి వాటిని మరోసారి చూసుకొని సబ్మిట్‌ చేయాలని సూచించారు. సబ్మిట్‌ చేసిన తర్వాత ఓ నంబర్‌ వస్తుందని, దాన్ని జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. జనగణన ఎన్యుమరేటర్‌ ఇళ్లకు వచ్చినప్పుడు ఆ నంబర్‌ను చెబితే వారు ఆ సమాచారాన్ని సరిచూసుకొని సబ్మిట్‌ చేస్తారని అక్కడితో జనగణన నమోదు పూర్తయినట్లేనని పేర్కొన్నారు. ఏప్రి ల్‌ 16 నుంచి డిజిటల్‌ జనగణన విధానం అమల్లోకి వస్తుందని 30వ తేదీలోగా పూర్తి చేయా లని చెప్పారు. ఎన్యుమరేటర్‌ వచ్చే సమయాని కి తాము ఊరిలో లేమని, ప్రయాణాలు వా యిదా వేసుకోవాల్సి వస్తుందన్న చింత ప్రజల కు లేకుండా ఉండేందుకే ఈ డిజిటల్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement