శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీలో దాదాపుగా నివసించేదంతా నిరుపేదలే. హుద్‌హుద్ సమయంలో అక్కడ పేదలకు నివాస గృహాలు అందించారు. అయితే ఇక్కడ నడిరోడ్డుపై టీడీపీకి చెందిన ఇన్‌చార్జి తనయుడు అడ్డంగా గోడ నిర్మించేశారని స్థానికులు కొంతమంది కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావుకి వినతి పత్రాన్ని సోమవారం ఆయన చాంబర్‌లో అందించారు. ఫిర్యాదు చేసేందుకు అధిక సంఖ్యలో బయలుదేరడంతో వెళ్లే వారికి పింఛన్, రేషన్ కట్ చేస్తామని బెదిరించారు కూడా. అయినా కొందరు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కంపోస్టు కాలనీ ఎన్టీఆర్‌నగర్ కాలనీ బ్లాక్ –11, 12 వెనుక భాగాన నడక దారిని మూసేశారు. తన బంధువులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని స్థానికులు తెలిపారు. కమిషనర్ తాను స్వయంగా వచ్చి చూస్తానని చెప్పడంతో మహిళంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం వినతుల స్వీకరిస్తానని తెలిపారు.


