రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది | - | Sakshi
Sakshi News home page

రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గొండు రఘురామ్‌

గార: రైతులపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభా గం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీపీ గొండు రఘురా మ్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట, ఎండబెట్టిన పంటలను పలువురు నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర దక్కక శ్రమ దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంట వద్దు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం చెప్పడమే గానీ రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్వింటాకు రూ.2,200ల మద్దతు ధర ఇచ్చినట్లు గుర్తు చేశారు. అందువలన రైతులు మొక్కజొ న్న సాగు అధికంగా చేశారన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టా రు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. లేదంటే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

పార్టీ నియోజకవర్గ రైతు విభా గం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చిందని, ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ మూకాళ్ల తాతబాబు మాట్లాడుతూ డీజిల్‌ ఇంజిన్లు ద్వారా సాగునీరు పెట్టుకోవడంతో మదుపులు పెరిగాయని, మద్ధతు ధర దక్కకపోతే నష్టాల పాలవుతారన్నారు. కార్యక్రమంలో గార, శ్రీకాకుళం మండల రైతు విభాగం అధ్యక్షులు శిమ్మ ధర్మరాజు, బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement