400 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

400 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

400 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం ● ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

కంచిలి: సోంపేట ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో నాటుసారా రవాణా, అమ్మకాలపై వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, గత నేర చరిత్ర కలిగిన పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక లక్ష్మణరావు అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు. దీంతో ఆయన ఒడిశా తుటుపురం నుంచి 300 నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపైన రవాణా చేస్తుండగా.. ఆదివారం సంత దగ్గర కాపుకాసి పట్టుకున్నారు. ఇతని నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. అదేవిధంగా మఠం సరియాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న రత్నాల హేమలత, బొండాడ మోహనరావుల నుంచి 100 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బొండాడ మోహనరావు, పులక లక్ష్మణరావులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలు. వీరి ముగ్గురినీ సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. నాటుసారాపై ఏదైనా సమాచారం ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14405 లేదా 94409 02358 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఎస్‌ఐ జగన్నాథ్‌, సిబ్బంది భాను ప్రసాద్‌, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement