నరసన్నపేట: మండలంలోని జమ్ము పంచా యతీ దశుమంతపురంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు సోమవారం దగ్ధమయ్యాయి. జుత్తు వెంకటరమణకు చెందిన 6 ఎకరాల గడ్డి నిల్వ చేయగా మంటలు అంటుకున్నాయి. గ్రామస్తు లు స్పందించేసరికే మంటలు అధికమయ్యా యి. రూ.20 వేల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం క్రైమ్: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సులో బాధిత ప్రజల నుంచి 72 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని భరోసా అందించారు.


