● ముగిసిన నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

● ముగిసిన నాటిక పోటీలు

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాల్గో ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో డి.వినయ్‌ దర్శకత్వంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ఆలోచించే విధంగా ప్రేక్షకులను ఎంతగానో హత్తుకుంది. విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కత్తి శ్యాం ప్రసాద్‌ దర్శకత్వంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటిక అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం కళాకారులు, నిర్వాహకులను సత్కరించారు. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి, ఎల్‌.రామ లింగస్వామి, కంచరానా అప్పారావు, పన్నాల నరసింహమూర్తి, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రదర్శనగా ‘చిటికెన వేలు’

నాటిక పొటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ‘చిటికెన వేలు’ నాటిక ఎంపికై ంది. రెండో ప్రదర్శనగా ‘చెరిగిపోని చిరునామా’, మూడో ప్రదర్శనగా ‘సీ్త్రమాత్రేయనమః’ ఎంపికయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement