కార్యకర్తలపై లాఠీచార్జి హేయమైన చర్య | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలపై లాఠీచార్జి హేయమైన చర్య

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

ప్రతి దెబ్బకూ కాలం సమాధానం

చెబుతుంది

మండిపడిన ధర్మాన కృష్ణచైతన్య

ఆమదాలవలస: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్యని, కార్యకర్తలపై పడ్డ ప్రతీ లాఠీ దెబ్బకూ కాలమే సమాధానం చెబుతుందని వైఎస్సార్‌సీపీ యువనేత, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలు, అరైస్టెన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం ఆయన ఆమదాలవలస పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ని కలిశారు. అనంతరం బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. అధికార మదంతో మా పార్టీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేడర్‌కు ఎటువంటి కష్టం వచ్చినా నాయకత్వం రోడ్డుమీదకు వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర కాళింగ విభాగ అధ్యక్షుడు ఆరంగి మురళీధర్‌, జలుమూరు మండల పార్టీ అధ్యక్షుడు కనుసు సీతారాం, పోలాకి మండల అధ్యక్షుడు కణితి కృష్ణారావు, పార్టీ సీనియర్‌ నాయకుడు రాజపు అప్పన్న, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, పార్టీ జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి అజంతాకుమారి, ముఖ్య నాయకులు చిగురుపల్లి ధనలక్ష్మి, దుంపల శ్యామలరావు, ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, నాగరాజు, రామ్మెహన్‌రావు, చింతు రామారావు, గుప్తా, బార్ల వేణుగోపాల్‌రావు, గరుగుబెల్లి వెంకటరమణి, చింతాడ ఉమా మహేశ్వరరావు, కనపల శేఖర్‌రావు, సతివాడ రామినాయుడు, కళ్లేపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement