అతివకు ఆసరా
నా జీవితానికి పూలబాట వేశారు
నా యుక్త వయస్సులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరి మహిళగా మిగిలిపోయాను. పింఛన్ కోసం ఎంతో మందిని కలిసినా ఎవరూ దయ చూపించలేదు. మా గ్రామంలో సాయిలక్ష్మీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో జగనన్న ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా నా జీవనానికి అండగా నిలబడింది. ఆ ఆసరానే నా జీవితానికి ‘పూల బాట’గా మారింది. మా గ్రామ దేవత ఆలయం చెంత పూల వ్యాపారం, దేవుని పూజా సామగ్రి కొట్టును పెట్టుకున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష 50వేలు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాను. జగనన్నే ఉండి ఉంటే నాకు ఇచ్చిన ఇంటి నిర్మాణం కూడా పూర్తయి ఉండేది.
– సాడి మీనాక్షి, లొద్దపుట్టి జంక్షన్,
ఇచ్ఛాపురం మండలం


