మత్తుతో జీవితం చిత్తు
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభ్యుదయ సైకిల్ యాత్ర వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29తో ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరగాల్సివుండగా, జనాదారణ పెరగడంతో యాత్ర పొడిగించామని, వచ్చే నెల 3న ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరుగుతుందని వెల్లడించారు.
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.


