నువ్వే అన్నా!
నాయక రత్నం
ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో ఫీడర్ అంబులెన్స్ లేకపోతే నాప్రాణాలు పోయేవి. నా బిడ్డతో ఈరోజు క్షేమంగా ఉన్నానంటే అది జగనన్న పెట్టిన భిక్షే. సరిగ్గా రెండున్నరేళ్ల కిందట డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రివేళ జోరువాన, ఎటూ కదల్లేని పరిస్థితిలో సైతం టెక్నీషియన్ మా గ్రామానికి వచ్చి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం తప్పి డెలివరీ జరిగింది. వైద్యులు ఎంతో చక్కగా వైద్యాన్ని అందించి నా ప్రాణాలు కాపాడారు. జగనన్నకు ధన్యవాదాలు.
– గొందర లక్ష్మీ, కేరాసింగి గ్రామం.
సంక్షేమ సంతకం


