విద్యాభివృద్ధి
వైఎస్ జగన్ రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్ చేశారు
నా పేరు డబ్బీరు హరీష్. మాది టెక్కలి. ఓ సాధారణ కుటుంబం. నాన్న విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తుంటారు. 2022లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలో మెకానికల్ విభాగం సీటు సాధించాను. అప్పటికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంజినీరింగ్‌లో అయితే చేరాను గానీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ వైఎస్ జగన్ హయాంలో ఐదు దఫాలుగా రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో అందాయి. రెండేళ్లు చక్కగా చదువుకుని మూడో ఏడాదికి వచ్చేశాను. ప్రభుత్వం మారాక ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు పడలేదు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌లో ఉన్నాను. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుంది. ఇటీవల అప్పు చేసి మరీ రూ.46 వేలు ఫీజు కట్టాం.


