సంప్రదాయాలను కాపాడదాం
శ్రీకాకుళం రూరల్ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్‌రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంప్రదాయాలను కాపాడదాం


