దేవుడి కంటే ముందు గుర్తొచ్చేది జగనే
ఈ రోజు నేను ఇలా మా కుటుంబంతో ఆనందంగా జీవించి ఉన్నానంటే వైఎస్ జగన్ చేసి న మేలే అందుకు కారణం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి నన్ను బతికించా రు. మాది పోలాకి మండలం పాలవలస గ్రామం. నా భర్త జోగారావుతో కలిసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్నాను. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉన్నంతలో ఆనందంగా ఉండే మాపై ఎవరి దిష్టి పడిందో గానీ, మాయదారి రోగం నన్ను అనారోగ్యం పాలుచేసింది. తొలుత ఆస్పత్రుల్లో డాక్టర్లకు చూపించిన తర్వాత పెద్ద జబ్బు అని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలీలేదు. చేతిలో డబ్బుల్లేవు. పెద్దాస్పత్రికి వెళ్లలేను. అలాంటి టైములో నా పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి మా వివరాలు ఇచ్చిన వెంటనే నాకు పూర్తి ఉచితంగా చికిత్స చేశారు. దాదాపు నెలరోజుల తరువాత పూర్తిగా వ్యాధి నయమైందని డాక్టర్లు మాకు చెప్పినపుడు దేవుడి కంటే ముందు జగన్ మాకు గుర్తొచ్చాడు. లక్షల్లో ఖర్చు అయ్యే ఇలాంటి వైద్యం మాలాంటి కుటుంబాలకు సాధ్యం కాని పని. మాలాంటి అనేకమంది దీవెనలు ఉన్నంతవరకు జగన్‌కు అంతా మంచే జరుగుతుంది. మాఅందరి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. – రాజులమ్మ
ఆరోగ్యశ్రీ


