ఆగిన ఆయువు | - | Sakshi
Sakshi News home page

ఆగిన ఆయువు

Dec 13 2025 7:26 AM | Updated on Dec 13 2025 7:26 AM

 ఆగిన

ఆగిన ఆయువు

సొంత వైద్యం వద్దు

పాలసింగి గ్రామంలో కిడ్నీ వ్యాధులపై వైద్య శిబిరంలో పాల్గొన్నాను. తాజాగా ఎలాంటి మరణాలు లేవు. అయితే గ్రామాల్లో ఉన్న వారు ప్రతి ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లను సంప్రదించాకే మందులు వాడాలి. సొంత వైద్యం వద్దు.

– శరత్‌ జ్యోత్స్న, నెఫ్రాలజిస్టు

ఎందుకు వచ్చిందో..

నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు కిడ్నీ వ్యాధి సోకి మూడేళ్లు గడిచింది. అస లు ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలీదు. ఊరిలో నీరు తాగడం వల్లే వచ్చిందని అంటున్నారు. – జన్ని వరలక్ష్మి

కిడ్నీ వ్యాధి బాధితురాలు, పాలసింగి

మితిమీరి మందులు వద్దు

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మితిమీరి మందులు వాడకూడదు. ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ తో పాటు జ్వరం, ఇతర సమస్యలకు అధికంగా మాత్రలను విని యోగిస్తారు. వీటి ప్రభావం కిడ్నీలపై ఉంటుంది.

– ఎస్‌.గాయత్రీ, వైద్యురాలు.

మా నాన్న చనిపోయారు

మా నాన్న మెండబోయిన అప్పన్న కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఆయన చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది.

– జర్జంగి లక్ష్మి,

కిట్టాలపాడు, టెక్కలి మండలం

కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న పాలసింగి గిరిజన గ్రామం

ఇప్పటి వరకు

కిడ్నీ వ్యాధితో

మరణాలు

15

వ్యాధి విస్తరించిన

గిరిజన గ్రామాలు:

పాలసింగి,

కిట్టాలపాడు,

సన్యాసినీలాపురం, సవరకిల్లి

కిడ్నీ వ్యాధి విస్తరిస్తోంది. పచ్చని పల్లెలకు ముచ్చెమటలు పట్టిస్తూ నిశ్శబ్దంగా ఆయువు తినేస్తోంది. దశాబ్దాలుగా ఉద్దానం పల్లెల్లో చావు డప్పు మోగిస్తున్న ఈ మహమ్మారి కన్ను ఇప్పుడు టెక్కలి మండలంపై పడింది. ఎందుకు వ్యాధి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే లోపే ప్రాణాలను హరించేస్తోంది. మండలంలో ఇప్పటికే 15 మంది వరకు వ్యాధి బారిన పడి చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న వ్యాధి బారిన పడి పల్లెలు తల్లడిల్లిపోతున్నాయి.

టెక్కలి/టెక్కలిరూరల్‌:

టెక్కలి మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి తదితర గ్రామాల్లో కిడ్నీ వ్యాధి విజృంభిస్తోంది. మిగిలిన గ్రామాల్లో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నా పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి తదితర గ్రామాల్లో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. ఈ గ్రామాల్లో అధిక శాతం మంది వ్యవసాయ కూలీలే. మొన్నటి వరకు కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి గ్రామాల్లో కిడ్నీ వ్యాధి జాడలు కనిపించాయి. తాజాగా పాలసింగి గిరిజన గ్రామంలో వెలుగు చూసిన కిడ్నీ వ్యాధులపై మెడికల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇతర శాఖల అధికారులు శిబిరాలు నిర్వహించి రక్త పరీక్షలు, నీటి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయా పరీక్షల్లో ఎక్కడా లోపం లేదని తేలుతున్నా జనం మాత్రం ఈ వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడిన వారంతా 35 ఏళ్లు దాటిన వారే.

ఈ గ్రామాల్లోనే ఎందుకు..?

టెక్కలి నుంచి మెళియాపుట్టి వెళ్లే మార్గంలో సన్యాసినీలాపురం, సవరకిల్లి, కిట్టాలపాడు, పాలసింగి వరుసగా వస్తాయి. ఇదే దారిలో కిడ్నీ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. ఈ కోణం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి గ్రామాల ప్రజలు శుద్ధ జలానికి నోచుకోలేదు. కొందరు బావి నీరు తాగుతుండగా కొందరు బోరు నీటిపై ఆధారపడుతున్నారు. వ్యాధి ప్రబలుతుండడంతో ఈ నీటిని తాగేందుకు భయపడుతున్నారు. కానీ ప్రత్యామ్నాయం అంతగా కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యం.

వ్యాధి

బారినపడిన వారి వయసు:

పదుల

సంఖ్యలో

బాధితులు

పల్లె తల్లడిల్లుతోంది

అత్యధికంగా గిరిజనులు జీవనం సాగిస్తున్న ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామంలో సుమారు ఏడుగురు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో చిన్నింటి అప్పలస్వామి, జన్ని మోహన్‌రావు, అనుపురం సుభద్ర, జన్ని వరలక్ష్మి మరో ముగ్గురు టెక్కలి, పలాస, శ్రీకాకుళం ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటున్నారు.

గ్రామంలో మెండబోయిన సోమేష్‌ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.

సన్యాసినీలాపురం గ్రామంలో బెహరా సోంపమ్మ, జీరు గంగారావు, నౌగాపు లక్ష్మి, జి.లక్ష్మణరావు తో పాటుగా మరో నలుగురు వ్యక్తులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.

సవరకిల్లి గ్రామంలో జయనవలస తిరుమలరావు ఈ వ్యాధి బారిన పడ్డారు.

టెక్కలి మండలాన్ని భయపెడుతున్న కిడ్నీ భూతం

పాలసింగి, కిట్టాలపాడు, సవరకిల్లి, సన్యాసినీలాపురం గ్రామాల్లో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధులు

ఏ గ్రామంలోనూ కనిపించని శుద్ధజలం సదుపాయం

ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య

ప్రభుత్వ చర్యలు శూన్యం

ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామానికి చెందిన మల్లిపురం పార్వతి అనే మహిళ రెండేళ్ల కిందట డయాలసిస్‌ చేయించుకుంటూ మృతి చెందారు. గత ఏడాది జన్ని రత్నాలు అనే మహిళ సైతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు.

కిట్టాలపాడు గ్రామంలో మోద లక్ష్మినారాయణ, కుందు అప్పన్న, మోద సవరయ్య, మెండబోయిన అప్పన్న, మెండపోయిన వెంకటరావుతో పాటు సుమారు మరో ఐదుగురు మృత్యవాత పడ్డారు.

సన్యాసినీలాపురం గ్రామంలోనూ గురుజు కామరాజు అనే వ్యక్తి ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఈ వ్యాధితోనే మృతి చెందారు. గురుజు సింహాచలం, రావివలస కాంచన, జీరు కృష్ణారావు, జీరు భాస్కరరావు, జీరు బుడమ్మ, బెవర తవిటయ్య తో పాటు మరి కొంత మంది కూడా మృతి చెందారు.

సవరకిల్లి గ్రామంలో ఇటీవల కాలంలో కిల్లి సోమేశ్వరరావు అనే గిరిజనుడు ఈ కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడ్డారు.

ఈ గ్రామాలన్నీ ఒకే మార్గంలో ఉండడం గమనార్హం.

 ఆగిన ఆయువు 1
1/5

ఆగిన ఆయువు

 ఆగిన ఆయువు 2
2/5

ఆగిన ఆయువు

 ఆగిన ఆయువు 3
3/5

ఆగిన ఆయువు

 ఆగిన ఆయువు 4
4/5

ఆగిన ఆయువు

 ఆగిన ఆయువు 5
5/5

ఆగిన ఆయువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement