తాకట్టు చిచ్చు.. అతనే రాజేశాడు
● గార ఎస్బీఐలో బంగారం మాయం కేసుకు సంబంధించి కీలక ఆధారాల సేకరణ
● బాధిత కుటుంబానికి ఎండార్స్‌మెంట్ ఇచ్చిన పోలీసులు
● ఆర్‌ఎం పాత్రపై నిజమైన ‘సాక్షి’ కథనాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కేసుకు సంబంధించి మొదటి నుంచి ‘సాక్షి’ పత్రిక రాసిన కథనాలే నిజమయ్యేలా ఉన్నాయి. అందుకు తగ్గట్టు పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించడమే కాకుండా కీలక సూత్రధారిగా అనుమానించిన రీజనల్ మేనేజర్ తోటకూర రమణమూర్తి రాజు, సీనియర్ అసోసియేట్ అండ్ జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం ప్రమేయం బయటపడింది. దీనికి సంబంధించి ఎండార్స్‌మెంట్‌ను బ్యాంకు ఉద్యోగిని ఉరిటి స్వప్నప్రియ కుటుంబానికి డీఎస్పీ సీహెచ్ వివేకానంద గురువారం అందించారు.
స్వప్నప్రియ తల్లి ఫిర్యాదుతో అనేక మలుపులు..
తన కుమార్తె స్వప్నప్రియను ఇంతటి భారీ కుంభకోణంలో ముద్దాయిని చేసి అన్యాయంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ జాతీయ మానవ హక్కుల, మహిళా కమిషన్, ప్రస్తుత హోం మినిస్టర్, సీఎంఓ కార్యాలయాలకు స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళాదేవి కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని డీఎస్పీ వివేకానంద కేసు విచారణ చేపట్టారు. ఆధారాలు సేకరించడమే కాకుండా 15 మందికి పైగా అనుమానితులను విచారణ చేస్తున్నారు.
రెండో కోణంలో ‘సాక్షి’ కథనాలు...
స్వప్నప్రియపైనే నెపం అంతా నెట్టేసి, ఆమెను ప్రధాన నిందితురాలిగా బ్యాంకు ఽఅధికారులు కథ నడిపించారు. ఒక్కరే ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4.7 కోట్ల విలువైన 7.146 కిలోల బంగారాన్ని ప్రైవేటు వ్యక్తులతో కలసి మాయం చేసిందన్నది అంత సులువైన పని కాదని, బ్యాంకు ఉన్నతాధికారులు, ఆడిటర్లు, కీలక సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదని ‘సాక్షి’ బలంగానే నమ్మింది. దీనికి తగ్గట్టుగానే డీఎస్పీ వివేకానంద అనేక కోణాల్లో విచారణ చేశారు. 2022లో స్వప్నప్రియ డిప్యూటీ మేనేజర్‌గా చేరడం, 2023 నవంబరులో తాకట్టు నగలు మాయమైన ఘటన వెలుగులోకి రావడం, నవంబరు 23న క్యాషియర్ ముంజేటి సురేష్‌ను స్వప్నప్రియే దాడి చేయించిందంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫేక్ ఫిర్యాదు చేయడం, వెనువెంటనే ఆమె క్యారెక్టర్ మంచిది కాదంటూ, కుంభకోణంలో ఆమే ప్రధాన పాత్రధారంటూ బ్లాక్‌మెయిలింగ్ కథనాలు రావడం, తట్టుకోలేక నవంబరు 29న ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, వెనువెంటనే చనిపోయిన స్వప్నప్రియే సోదరుడు కిరణ్ సాయంతో అంతా చేసిందంటూ పోలీసులకు నవంబరు 30న రీజనల్ మేనేజర్ తోటకూర రమణమూర్తి రాజు, మేనేజర్ రాధాకృష్ణలు ఫిర్యాదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దానికి తగ్గట్టుగానే పోలీసులు డిసెంబరు 8న అసలు నిందితులను వదిలేసి ఏడుగురిని అరెస్టు చేయడం, రికవరీ బంగారాన్ని కోర్టుకు అప్పగించడం మరింత అయోమయానికి గురిచేసింది.
రాజు ఆధ్వర్యంలోనే..
అటు కోర్టును, ఇటు పోలీసులను, తల్లిలా భావించాల్సిన సొంత బ్యాంకును తప్పు దోవ పట్టించి రీజనల్ మేనేజర్ రాజే ఇ దంతా చేశారని అప్పట్లోనే అనుమానాలు రేకెత్తాయి. తర్వాత జరిగిన అనేక పరిణామాలే రాజే అసలైన సూత్రధారి అయ్యుంటారని రుజువు చేశాయి. కుంభకోణం జరిగిన సమయంలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్‌తో సహా మరికొందరిని ఆగమేఘాలపై బదిలీ చేసేయడం, జాయింట్ కస్టోడియన్‌లుగా ఉన్న ఇద్దరు క్యాషి యర్‌లలో ఒకరిని పోలీసుల ఒత్తిడితో లొంగిపోయి అరెస్టు అయ్యేలా చేయడం, మరొక కస్టోడియన్ జి.లోకనాథంను వదిలేయడం, 2023 అక్టోబరులో స్వప్నప్రియ సంచులు మాయం చేసినట్లు (సీసీ ఫుటేజీ ఆధారంగా నమ్మించి), 14 నెలలుగా ఈ తతంగం జరిపినట్లు పోలీసుల వద్ద చెప్పిన ఆర్‌ఎం రాజు అంతకుముందు నెలలో జరిగిన సెంట్ర ల్ ఆడిట్‌లో అంతా క్లియర్‌గా ఉన్నాయంటూ వారిపై ఉన్నతాధికారులకు ఎలా నివేదిక పంపించారన్నది పోలీసులను ఆలోచింపజేశాయి. నరసన్నపేట, శిలగాం బ్రాంచిల కుంభకోణాల్లోనూ రాజు పాత్రపై అనుమానాలు రేకెత్తాయి.
పోలీసు ఎండార్స్‌మెంట్‌తో క్లారిటీ
పోలీసులు స్వప్నప్రియ కుటుంబానికి ఇచ్చిన ఎండార్స్‌మెంట్ ప్రకారం అప్పటి, ఇప్పటి ప్ర భుత్వాల ప్రమేయం కానీ, పోలీసుల ప్రమే యం కానీ ఈ కేసులో లేదని, ఆర్‌ఎం రాజు, సీనియర్ అసోసియేట్ అండ్ జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం ప్రమేయం ఉందని ఆధారాలు సేకరించారు. బాధి త కుటుంబానికి ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌లో ఇదంతా స్పష్టం చేశారు.
తాకట్టు చిచ్చు.. అతనే రాజేశాడు
తాకట్టు చిచ్చు.. అతనే రాజేశాడు
తాకట్టు చిచ్చు.. అతనే రాజేశాడు


