‘యువత బాధ్యతగా ఉండాలి’
పొందూరు: యువత ప్రవర్తన, చేసే పనులు బాధ్యతాయుతంగా ఉంటే వారి లక్ష్యాన్ని సు లువుగా చేరుకోగలరని సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విడుదల ప్రమోషన్‌లో భాగంగా పొందూరులోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. యువతలో క్రమశిక్షణ, పట్టుదల, కృతజ్ఞత, సామాజిక బాధ్యతల భావన, నైతిక విలువలు బలపడాలని అన్నారు. యువత వ్యసనాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, వాటి వైపు మొగ్గు చూపకూడదని చెప్పారు.
బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు
రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన పిన్నింటి మల్లేశ్వరరావు(64)కు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయిందని డీఎంఓ పీవీ సత్యనారాయణ, లావేరు పీహెచ్‌సీ వైద్యులు మౌనిక తెలిపారు. అయితే ఆయనలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. పదిరోజుల కిందట పొలం పనులకు వెళ్లిన మల్లేశ్వరరావుకు పేడ పురుగు కరిచింది. రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చింది. ఈ నెల 10న ఆయన 104 సిబ్బందికి చూపించుకున్నారు. లావేరు పీహెచ్‌సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి సూచించగా అలాగే చేశారు. లావేరు వైద్యులు రక్త నమూనాలను శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య బృందం ఆయన ఇంటికి వెళ్లగా ఆయన పొలం పనులకు వెళ్లిపోయారు. మళ్లీ వచ్చి పరిశీలించగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా బెజ్జిపురం గ్రామంలో వైద్య శిబిరంతో పాటు, ప్రాంతాలన్నీ బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు వీధుల్లో అవగాహన కల్పించారు.
15న కోటి సంతకాల
ప్రజాఉద్యమం
● విజయవంతం చేయాలని కృష్ణదాస్ పిలుపు
నరసన్నపేట: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల అభిప్రాయ సేకరణ ప్రజా ఉద్య మం చివరి దశకు చేరిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ నెల 15న కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్‌తో కలసి కృష్ణదాస్ నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సంతకాల ప్రతులు ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయానికి చేరాయని, 15న ఈ ప్రతులు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని టౌన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతుల వాహనాన్ని జెండా ఊపి తరలిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పొందర, కూరాకుల విభాగం అధ్యక్షుడు రాజా పు అప్పన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురంగి నర్శింగరావు, ఐటీ విభాగం కార్యదర్శి కల్లి అజయ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సతివాడ రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘యువత బాధ్యతగా ఉండాలి’


