పోక్సో కేసు నమోదు
రణస్థలం: మురవాడ గ్రామానికి చెందిన అక్కివరపు ప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం తెలిపారు. రణస్థలం మండలం గిరివానిపాలెం గ్రామానికి చెందిన బాలిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 9న ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి గిరివానిపాలెం పట్టుకెళ్లిపోయాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ను పట్టుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ధాన్యం బుగ్గిపాలు
మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామం కేరాసింగిలో రెండెకరాలకు సంబంధించిన వరి ధాన్యం దగ్ధమైంది. చీడిగుడ్డి గవిరేసు తన భార్య భారతితో కలిసి రెండురోజుల క్రితం రెండెకరాల్లో వేసిన ధాన్యాన్ని కోతకోసి కల్లానికి చేర్చాడు. గురువారం రాత్రి వరకు యంత్రంతో నూర్చి కుప్పగా వేసి దానిపై టార్పాలిన్లు కప్పి ఇంటికిచేరాడు. కొద్దిసేపటికే పొలంలో మంటలు రావడంతో అక్కడికి వెళ్లి చూసేసరికి ధాన్యం కాలిపోయింది. ఎవరో గిట్టనివారు నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు.


