పదోన్నతుల్లో అవకతవకలౖపై విచారణ!
అరసవల్లి/సారవకోట: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడుతుండటం పట్ల ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. జిల్లా డీఎంహెచ్‌ఓ శాఖలో పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించి, ఏడు రోజులు పూర్తి నివేదిక ఇవ్వాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కు జాతీయ ఎస్టీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 159 గ్రేడ్ 3 ఏఎన్‌ఎం ప్రమోషన్ విషయంలో అవకతవకలు జరిగాయని దళిత ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. దీనిపై కలెక్టర్ కమిటీ వేసి విచారణ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది అధికారులు ముడుపులు తీసుకుని పదోన్నతుల జాబితా సిద్ధం చేశారని దళిత ఆదివాసీ సంఘాల ఆరోపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిగితే అర్హులైన గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
15 నుంచి అభ్యుదయ యాత్ర
శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు, వాటి నిర్మూలనే లక్ష్యంగా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 15 నుంచి అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రజలంతా ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జె.ఆర్. పురం సర్కిల్ పరిధి నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ యాత్ర డిసెంబరు 29 వరకు కొనసాగనుందని వివరించారు. రెవెన్యూ, విద్యా, మెడికల్ అండ్ హెల్త్, ఉమెన్ అండ్ ఛైల్డ్‌లైన్, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనేలా విద్యాసంస్థలు చొరవ తీసుకోవాలని, పట్టణాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
సమర్థ పోలీసులుగా తీర్చిదిద్దాలి
శ్రీకాకుళం క్రైమ్: కానిస్టేబుల్ అభ్యర్థులకు సమగ్ర శిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి సమర్ధ పోలీసులుగా తీర్చిదిద్దాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, పోలీసు శిక్షణా కేంద్రం సిబ్బంది, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలవాలన్నారు. నూతన చట్టాలు, పోలీసు నిబంధనలపై అవగాహన కల్పించాలని, నేరపరిశోధనల్లో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
ఆకట్టుకున్న మాక్ పోలింగ్
నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఏ ఆదేశాల మేరకు విద్యార్థులతో యాక్టిజన్ క్లబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించామని హెచ్‌ఎం వకులా రత్నమాల తెలిపారు. వీరి ఎన్నిక పోలింగ్ పద్ధతిలో నిర్వహించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.లక్ష్మణరావు, లీలారాణి, కేశవరావు, సుభాషిణి, లక్ష్మీ భవానీ, భీమారావు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఖోఖో జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికలు, సీనియర్స్ పురుషులు మహిళల ఖోఖో జట్ల ఎంపికలు ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం, కార్యదర్శి సీహెచ్ ఫాల్గుణరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాదు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా ఉదయం 9 గంటలకు ఎంపికల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఎంపికై నవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. సీనియర్స్ విభాగానికి వయస్సుతో సంబంధం లేదని, జూనియర్స్‌కు మాత్రం 2025 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లులోపు బాలబాలికలు అర్హులని చెప్పా రు. వయస్సు, ఎత్తు, బరువు కలిపి 250 పాయింట్ల(ఇండెక్స్ 250)కు మించి ఉండకూడ దని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 94419 14214 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
సోలార్ ప్రాజెక్టులు
వేగవంతం చేయాలి
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబునాయుడు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసు మ్, పీఎం సూర్యఘర్, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్‌ఆర్‌ఈ, ఆర్‌డీఎస్‌ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.


