
తేనెటీగల పెంపకంతో ఉపాధి
ఆమదాలవలస: తేనెటీగల పెంపకాన్ని శాసీ్త్రయ పద్ధతిలో అభివృద్ధి చేసుకొని, తద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డు, కేవీకే సంయుక్తంగా తేనెటీగల పెంపకంపై యువతకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా రైతులు, మహిళలు, యువత ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. శిక్షణలో పాల్గొన్నవారు తేనెటీగల పెంపకాన్ని వృత్తిగా స్వీకరించి, పరిశ్రమలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాబార్డు డీడీఎం కె.రమేష్ కృష్ణ మాట్లాడుతూ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి నాబార్డు నుంచి తగిన ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. డీఆర్‌డీఏ డీపీవో బి.నారాయణరావు మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న రైతులు, యువత తేనెటీగల పెంపకానికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుని, అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలతో అనుసంధానం కావాలని సూచించారు. అనంతరం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.అనూష తేనెటీగల సంరక్షణ, వ్యాధుల నివారణ, శాసీ్త్రయ మెలకువలపై వివరించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఎస్.రాయ్ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారవేత్తల దిశగా విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత తేనె ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు