
నిరసనలకు దిగిన విద్యుత్ ఉద్యోగులు
అరసవల్లి: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగ కార్మికులు దశలవారీగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులను నిర్వర్తించగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రంలో సర్కిల్ కార్యాలయం వద్ద భోజన విరామ సమలో ధర్నా నిర్వహించేలా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఈ నెల 19,20 తేదీల్లో సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలకు దిగనున్నారు. అనంతరం ఈనెల 22న జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు వినతిపత్రా న్ని ఇవ్వడంతో దశలవారీ ఆందోళనలను విర మించనున్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లుగా జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన నోటీసును సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తికి జేఏసీ చైర్మన్ మహంతి ప్రభాకరరావు, కన్వీనర్ జి.రమేష్‌కుమార్, ముఖ్య సభ్యులు పీవీఏ నాయు డు, ఎం.శ్రీనివాసరావు, పీవీ రమణ, బీవీ గురునాథరావు, పి.ఉమాశంకర్, టీవీ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.