
బహు భాషా కోవిదుడు రోణంకి
టెక్కలి: బహు భాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామి అని సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. సోమవారం టెక్కలిలో రోణంకి అప్పలస్వామి 116వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కవులకు మార్గదర్శకుడు రోణంకి అప్పలస్వామి అని వక్తలు పేర్కొన్నారు. తెలుగు భాషలోని నవలలను ఫ్రెంచ్ భాషలోకి అనువదించడంతో పాటు ఫ్రెంచ్, జర్మనీ, లాటిన్ వంటి భాషల్లో సాహిత్య సంపదను ఖండాంతరాలకు చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రోణంకి అప్పలస్వామి అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జీవి రెడ్డి, సీహెచ్ ప్రభాకరరావు, గుంట లీలావరప్రసాద్, కె.ధనుంజయరావు, ఎస్.వెంకటఅనిల్, బి.అయ్యబాబు, ఆర్.రామచంద్రరావు, డీఏ స్టాలిన్, కె.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.