
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెద్దమడి విద్యార్థులు
మెళియాపుట్టి: జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దమడి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొనగా ఇద్దరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సోమవారం ప్రిన్సిపా ల్ లక్ష్మునాయుడు, వైస్ ప్రిన్సిపాల్ రామానంద్, పీడీ లక్ష్మణమూర్తి తెలిపారు. అండర్ 18 విభాగంలో లాంగ్ జంప్‌లో ఎం.కృపాసింధు, 110 హడిల్స్ మీటర్లలో బి.గోవింద్ ప్రథమస్ధానంలో నిలిచి అంతర్ రాష్ట్ర క్రీడా పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.