
కేంద్రమంత్రి ప్రజల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?
మందస: కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయు డు ప్రజల పక్షమా, కార్పొరేట్ పక్షమా స్పష్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ నిలదీశారు. కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో ప్రజల ఆస్తులను కార్పొ రేట్ ఆస్తులుగా ఎందుకు మార్చడానికి చూస్తున్నారని ప్రశ్నించారు. మందస మండలం బాహడపల్లిలో బలవంతపు భూ సేకరణ ఆపాలని, కార్గో ఎయిర్ పోర్టు రద్దు చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, జోగి అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేశారు. ఢిల్లీలో కార్గో ఎయిర్‌పోర్టుకు 150 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, ఇక్కడ 1400 ఎకరాలు ఎందుకని అడిగా రు. కార్యక్రమంలో పొట్టి ధర్మారావు, హేమంత్ రావు, కుసుమ, కృష్ణారావు, జగన్, బాలకృష్ణ, పరశురాం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘మా ఎరువులు
ఎటు పోతున్నాయి..?’
సరుబుజ్జిలి: తమకు రావాల్సిన కోటా ఎరువు లు అందించకుండా ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తున్నారని పెద్దవెంకటాపురం, చినవెంకటాపురం, పాలవలస, రావివలస గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం రావివలస ఆర్‌ఎస్‌కే వద్ద అధికారులను ప్రశ్నించా రు. ఎరువు పంపిణీ సక్రమంగా లేదని రైతులు ఆగ్రహించారు. తమకు నచ్చినవారికి ఇళ్ల వద్దనే టోకెన్లు జారీ చేస్తున్నారని, దీని వల్ల క్యూలో ఉన్న రైతులకు ఒక్క బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.3.14లక్షలు
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.3,14,385 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 39 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని సోమవారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి టీపీ మనస్వి పర్యవేక్షించారన్నారు. కార్యక్రమంలో ఆలయ గుమస్తా సుదర్శన్, శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి ప్రజల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?

కేంద్రమంత్రి ప్రజల పక్షమా.. కార్పొరేట్ పక్షమా?