తినేస్తున్నాడెమో..! | - | Sakshi
Sakshi News home page

తినేస్తున్నాడెమో..!

Sep 16 2025 8:32 AM | Updated on Sep 16 2025 8:32 AM

తినేస

తినేస్తున్నాడెమో..!

అరసవల్లి: అది వైద్యారోగ్య శాఖ. అందులో ఓ విభాగం పేరు డెమో. అంటే జిల్లా మాస్‌ మీడియా, విస్తరణ విభాగం. అందులో ఓ అధి కారి అంతా తానై వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులు తినేస్తున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దినోత్సవాలొస్తే పండుగే

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖకు చెందిన ఏ దినోత్సవ ఏర్పాట్లు, ప్రచార నిర్వహణ అయినా ఈ డెమో విభాగానికి పండగే. వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల ప్రాప్తికి బిల్లులు పెట్టేసి ఎంచక్కా నిధులను మింగేస్తున్నారు. చిన్నపాటి అవగాహన కార్యక్రమా నికై నా కరపత్రాల పంపిణీ, పత్రికల ప్రకటనలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పేరిట రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులు ఆ అధికారి జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. శాఖకు సంబంధించిన పలు దినో త్సవాలు, కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, సచివాలయాల వద్ద కరపత్రాలను అంటించాలి, బ్యానర్లు పెట్టించాలి. అయితే ఇలాంటి చర్యలేవీ జిల్లాలో కానరావడం లేదు. కానీ బడ్జెట్‌ కేటాయింపులు మాత్రం జరిగిపోతున్నాయి. ఈ అధికారి తన బృంద సిబ్బంది సహకారంతో తప్పుడు బిల్లులు, నకిలీ బిల్లులు ఫోర్జరీ సంతకాలతో రశీదులు చూపించి బిల్లులు చేయించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన జనాభా దినోత్సవానికి ప్రభుత్వం రూ.లక్ష కేటాయిస్తే వేసక్ట్టమీ ఆపరేషన్లు చేయించుకున్నవారికి ప్రోత్సాహంగా రూ.55 వేలు కేటాయించగా మిగిలిన మొ త్తాన్ని దినోత్సవ ఏర్పాట్లు పేరిట బిల్లులు పెట్టేశా రు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి పాత బ్యానర్‌తోనే పలు ప్రైవేటు నర్సింగ్‌ విద్యార్థులతో ర్యాలీ చేసి బిల్లులు చేసుకున్నారు.

తనిఖీల పేరిట రూ.లక్షల్లో వసూలు

జిల్లాలో అన్ని ప్రైవేటు క్లినిక్‌లు, ల్యాబ్‌లను ఈ డెమో బృందమే తనిఖీ చేస్తుంది. ఇలా తనిఖీల పేరిట ఒక్కో ఆస్పత్రి, ల్యాబ్‌ల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇందులో జిల్లా శాఖకు చెందిన కీలక అఽధికారికి కూడా వాటా ఇస్తుండడంతో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే క్లీన్‌చిట్‌ వస్తోంది. బెడ్‌లను బట్టి ఒక్కో నర్సింగ్‌ హోం నుంచి సుమా రు రూ.50 వేల వరకు, ల్యాబ్‌ల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఐవీఎఫ్‌ సెంటర్లు, స్కానింగ్‌ సెంటర్లయితే అడిగినంత ఇవ్వాల్సిందే.

వైద్యారోగ్య శాఖలో అక్రమాలకు కేంద్రంగా ‘డెమో’ విభాగం

పలు దినోత్సవాల ప్రచారాల పేరిట దోపిడీ

ప్రతి నెలా తనిఖీల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్న విభాగాధికారి

తినేస్తున్నాడెమో..! 1
1/1

తినేస్తున్నాడెమో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement