
● ‘పాఠశాలల రక్షణ కోసమే రణభేరి’
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం, విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రణభేరి జాతర కార్యక్రమం జరుగుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పలాస కేంద్రంలో బస్టాండ్ దగ్గర రణభేరి కార్యక్రమాన్ని డప్పు మోగించడం ద్వారా ప్రారంభించారు. శ్రీకాకుళంలో యూటీఎఫ్ కార్యాలయం వద్ద ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. టీచర్లకు అదనపు పనులు చెప్పడం సరికాదన్నారు. పిల్లలకు అక్షరం నేర్పించే సమయం కూడా ఇవ్వడం లేదని అన్నారు. పలాసలో పోలీసులు కార్యక్రమానికి విఘాతం కలిగించడం సరికాదన్నారు. ఈ రణభేరి ప్రచార జాత సెప్టెంబర్ 25న గుంటూరు పట్టణంలో ముగుస్తుందని తెలిపారు.