
మద్యానికి బదులు గడ్డి మందు తాగి..
బూర్జ: మద్యం మత్తులో గడ్డి మందు తాగిన బూర్జ మండలం తోటవాడ పంచాయతీ టి.ఆర్.రాజుపేటకు చెందిన కొంగరాపు ప్రభాకరరావు (45) శనివారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకరరావు మద్యానికి బానిసయ్యాడు. గురువారం వేకువజామున బాటిల్ తేడా గమనించక గడ్డి మందు తాగాడు. శుక్రవారం ఉదయం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు గమనించి 108 అంబులెన్సులో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే ప్రభాకరరావుకు భార్య కేసరమ్మ, కూమారుడు దుర్గాప్రసాద్, వివాహమైన కుమార్తె ఉన్నారు. కేసరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.