సిక్కోలుకునేదెలా..? | - | Sakshi
Sakshi News home page

సిక్కోలుకునేదెలా..?

Sep 14 2025 6:10 AM | Updated on Sep 14 2025 6:10 AM

సిక్క

సిక్కోలుకునేదెలా..?

అరసవల్లి: పల్లె పల్లెనా, వీధివీధినా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గడప తొక్కినా ఒకరిద్దరు జ్వర బాధితులు కనిపిస్తున్నారు. అయితే ఎక్కడా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల చర్యలు కానరావడం లేదు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులను పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా జ్వర బాధిత రోగుల సంఖ్య ను నివేదికల్లో తక్కువగా చూపించాలంటూ.. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయ కుడు అధికారులకు హుకుం జారీ చేయడం పాలకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

ఒంటి నొప్పులు తీవ్రం..

జ్వరాలతో పాటు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు చాలా తీవ్రంగా ఉండడం ఇప్పుడు జిల్లాలో కనిపిస్తోంది. జిల్లాలో 30 మండలాల్లో సుమారు 6 లక్షల ఇళ్లుంటే కనీసంగా చూసినా పది వేలమందికి పైగా నే జ్వర పీడితులు ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయినప్పటికీ జిల్లా వైద్య శాఖ లెక్కల ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు కేవలం 31 మాత్రమే మలేరియా కేసులు, 5 మాత్రమే డెంగీ కేసులు, చికెన్‌గున్యా కేసులు 2 వరకు మాత్రమే నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవ లెక్కల ప్రకారం చూస్తుంటే మలేరియా కేసులు వందకు పైగా ఉన్నాయని, వివిధ రకాల వైరల్‌ ఫీవర్ల బాధి తులు సుమారు 4 వేల మందికి పైగా ఉన్నట్లుగా సమాచారం.

సర్వేలన్నీ గారడీలే..

జిల్లాలో మలేరియా నియంత్రణ విభాగం జ్వరాల శాంపిల్స్‌ను సేకరించే బాధ్యత నిర్వర్తిస్తుంది. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు సర్వే అంకెలు పైన పేర్కొన్న విధంగా ఉన్నాయి. అయితే ఈనెల మొదటి వారంలోనే సుమారు 18 వేల శాంపిల్స్‌ తీసుకుంటే 2 వేల మందికి పైగా జ్వర పీడితులు మంచాన పడినట్లుగా తెలుస్తోంది. ఇక శాంపిల్స్‌కు దూరంగా ఉన్న వారి లెక్కను అదనంగా చేర్చితే సంఖ్య ఏడెనిమిది వేలకు చేరుకున్నా ఆశ్చర్యం కలగకమానదు.

చర్యలేవీ..?

జిల్లాలో గత నెల నుంచి నేటి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల తీవ్రత అధికమై జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వందల్లో ఉంది. అలాగే వర్షాల కారణంగా కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవ హిస్తూ పరిసరాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది. అయి తే పల్లెల నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరకు ఎక్కడా పారిశుద్ధ్య మెరుగు చర్యలు పెద్దగా చేపట్టలేదు. నగరంతో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో కాలువల్లో షిల్టు తీసినప్పటికీ తాజా వర్షాలతో మళ్లీ యఽథాస్థితికి చేరాయి. వైద్యశాఖ తరఫున మాత్రం దోమల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా 5 లక్షల వరకు గంబూషియా చేపలను వేయించేలా చర్యలు ప్రారంభించినప్పటికీ అదంతా ప్రచార ఆర్భాటంగా మార్చారు. దీంతో ఇప్పటి వరకు కనీసం లక్ష వరకు కూడా గంబూషియా చేపలను నీటి వనరుల్లో వేయలేకపోయారు.

కానరాని సర్వేలు

జిల్లాలో వైద్యారోగ్య శాఖ తరఫున క్షేత్ర స్థాయిలోనే జ్వరాలు, సీజనల్‌ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇంటింటి సర్వేలు చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ/వార్డు సచివాలయాలతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్‌ అసిస్టెంట్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యశా ఖ చర్యలపై, ప్రజారోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో తాజాగా సీజనల్‌ వ్యాధుల తీవ్రత అధికమైంది.

జిల్లాలో వీధివీధికీ వ్యాపించిన జ్వరాలు

తీవ్రంగా ఒంటి నొప్పులు

పట్టించుకోని పాలకులు

కానరాని సర్వేలు

పీహెచ్‌సీల పరిధిలో నమూనాల సేకరణ

జిల్లాలో జ్వరాల వ్యాప్తి నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నాం. ఇంటింటికీ ప్రతి 15 రోజులకొకసారి హెల్త్‌ అసి స్టెంట్‌, ఏఎన్‌ఎంల బృందం విజిట్‌ చేసి శాంపిల్స్‌ సేకరణ చేపడతారు. ప్రామాణిక పరీక్షల నిర్ధారణ అనంతరం జ్వరాలను గుర్తిస్తాం. అలాగే పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ సర్వేలు చేపడుతున్నాం. మెడికల్‌ ఆఫీసర్లకు నిత్యం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నాం. – డాక్టర్‌ కె.అనిత, డీఎంహెచ్‌ఓ

సిక్కోలుకునేదెలా..? 1
1/2

సిక్కోలుకునేదెలా..?

సిక్కోలుకునేదెలా..? 2
2/2

సిక్కోలుకునేదెలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement