
ఒక్కటే దరఖాస్తు
ఒక్కటంటే
● స్పందన కరువవడంతో బార్‌లకు మళ్లీ రీ–నోటిఫికేషన్
● దరఖాస్తు గడువు ఈనెల 17కు పొడిగింపు.. డ్రా 18న
శ్రీకాకుళం క్రైమ్ : ప్రైవేటు టెండర్‌దారుల లైసెన్సు ఫీజులతో ఆదాయం సమకూరుతుందన్న ఆశ.. ప్రభుత్వాన్నే కాదు ఎకై ్సజ్ శాఖకు సైతం షాకులిస్తోంది. బార్లకు టెండరుదారుల నుంచి మూడు సార్లు దరఖాస్తులు కోరినా స్పందన మా త్రం రావడం లేదు. మొదటిసారి 19 బార్లకు రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేయగా కేవలం ఐదు బార్లకు 22 దరఖాస్తులే వచ్చాయి. మిగతా 14 బార్లకు ఈనెల 15న డ్రా తీస్తారన్నా ఇప్పటికి ఒక్కటంటే ఒక్క దరఖాస్తే (ఇచ్ఛాపురం) చేరడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెల కొంది. ఓ వైపు టీడీపీ పెద్దలు డ్రా జరగకుండానే లోపాయికారీగా తక్కువ సొమ్ముతోనే తమ వాళ్లు షాపులు దక్కించుకోవాలని బలంగా మనసులో పెట్టుకున్నారు. పైకి మాత్రం అధికారులపై దరఖా స్తులు ఎక్కువ పడేటట్లు చూడాలని, మళ్లీ మళ్లీ నోటిఫికేషన్లు ఇవ్వండంటూ ఒత్తిడి తెస్తున్నారు. దాని ఫలితమే ఈనెల 18న డ్రా తీయడానికి ప్రభు త్వం మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 17 దరఖాస్తులకు స్వీకరణ గడువుగా తేల్చింది.
దుకాణాలపై మోజు పడి మరీ..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం దుకాణాలను నడిపి ప్రైవేటు వ్యాపారుల కడుపు కొట్టిందని ఎన్నికల్లో విమర్శలు ఎక్కుపెట్టిన కూట మి ప్రభుత్వం.. అవే మద్యం దుకాణాలను ప్రైవే టు టెండరుదారులకు కట్టబెట్టాలనుకుంది. ఈ విధానంలో దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజుల్లో దండిగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. వ్యాపారులు సైతం దండిగా సంపాదించవచ్చనే ఆశతో లైసె న్సులు పొందేందుకు ఎగబడ్డారు. గత ఏడాది అక్టోబరులో జనరల్ కేటగిరీలో 158 ప్రైవేటు లైసె న్సు దుకాణాలకుగాను 4671 దరఖాస్తులు, గీతకులాలవారికి (రిజర్వ్ కేటగిరీలో) 18 దుకాణాలకు 203 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుమే రూ. 2 లక్షలు కాగా మొత్తంగా రూ. 4.06 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇక లైసెన్సు ఫీజైతే 158 దుకాణాలకు (ఒక్కో దుకాణానికి రెండేళ్లు లీజుకు గాను రూ. 65 లక్షలు) రూ. 102 కోట్ల పైనే రాబడి వచ్చింది. రిజర్వ్ కేటగిరీలో దాదాపు రూ. 6 కోట్లు.. మొత్తం పైన రూ. 108 కోట్ల దక్కించుకుంది.
బార్ల లైసెన్సు పొందేందుకు అనాసక్తి..
బార్ల లైసెన్సు పొందేందుకు న్యూట్రల్‌గా ఉన్న వ్యాపారుల నుంచి అనాసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజులకే ప్రభుత్వం కక్కుర్తి పడుతుంది తప్ప మార్జిన్ 20 శాతం పెంచకపోవడం ఓ కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ షాపు దక్కించుకున్నా తమ చేతిలో ఉంటుందో.. టీడీపీ నాయకుల సిండికేట్ చేతికి వెళ్తుందో అన్న అనుమానం కూడా మరో కారణంగా తెలుస్తోంది.

ఒక్కటే దరఖాస్తు