డీఈఓగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

డీఈఓగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు

Sep 14 2025 6:10 AM | Updated on Sep 14 2025 6:10 AM

డీఈఓగ

డీఈఓగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు

శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఈ ఓ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్‌చార్జి డీఈఓగానే కొనసాగించారు. ఈయనకు బీఈడీ డిగ్రీ లేకపోవడంతో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించలేకపోయారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో రవిబాబు ఉత్తీర్ణులు కావడంతో పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడానికి మార్గం సుగమం కాగా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

కొత్తమ్మ తల్లి జాతరలో వీడియో పోటీలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కోటబొమ్మాళి కొత్త మ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా వీడియో పోటీలు నిర్వహించనున్న ట్టు జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమ్మవారి వైభవం, చరిత్ర, గత ఉత్సవాల జ్ఞాపకాలు అన్ని విషయాలను ప్రతిబింబించేలా 3 నుంచి 5 నిమిషాల నిడివి గల వీడి యోలు రూపొందించాలని తెలిపారు. వీటిని జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సాయి కుమార్‌కి ఈ మెయిల్‌ drdosrikakulam @apssdc.in ద్వారా ఈనెల 16వ తేదీ లోగా వీడియోలు పంపాలని తెలిపారు. మొదటి ముగ్గురు విజేతలకు రూ.5,000 రూ.3,000,రూ.2,000 నగదు బహుమతులు అందజేయనున్నారని తెలిపారు. ఈ నెల 23న ఉదయం 8–9 గంటలకు ఆలయం వద్ద కర్టెన్‌ రైజర్‌ ప్రోగ్రాం, 23, 24 తేదీల్లో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో గ్రామీణ క్రీడలు, 24న మధ్యాహ్నం 3–5 గంటల వరకు కొత్తపేట జంక్షన్‌ నుంచి ఆలయం వరకు శోభాయాత్ర, 23–25 తేదీల్లో సాయంత్రం 6–11 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 25న రాత్రి 7–9 గంటల వరకు క్రాకర్స్‌ షో, జాతర మూడురోజులూ ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ అలరించనున్నాయి. హెలికాఫ్టర్‌ రైడ్‌ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, ప్రజలందరూ పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.

డీఈఓగా రవిబాబుకు  పూర్తి అదనపు బాధ్యతలు 1
1/1

డీఈఓగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement