
నేతల యూరియా మేత!
టీడీపీ నాయకుడు సిమ్మ చంద్రశేఖర్ డబ్బు ఇవ్వకుండా 100 బస్తాలు దాచేయమన్నారు. అప్పటికే రైతులు ఆధార్ కార్డు, వన్‌బీ, డబ్బులు పట్టుకుని ఉన్నారు. ఈయన డాక్యుమెంట్స్ ఇవ్వలేదు సరికదా రైతులకు యూరియా ఇవ్వవద్దని అన్నారు. కానీ, రైతులకే ఇచ్చాను. దీంతో ఆయనకు ఇవ్వలేదని ఎమ్మెల్యేకు చెప్పి నాకు డిప్యూటేషన్‌పై వేసేశారు. – ఇదీ కిల్లాం మాకివలసలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్‌కు ఎదురైన పరిణామం
నరసన్నపేట పీఏసీఎస్‌కు వచ్చిన 400బస్తాలు యూరియా టీడీపీ నాయకులే పంచుకున్నారు. ఇతరులెవ్వరికీ ఇవ్వలేదు. ఇలా చేస్తే రైతులు ఏమవ్వాలి.
– మండల సమావేశంలో ఎంపీటీసీ ప్రతినిధి కింతలి చలపతిరావు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో యూరియాను టీడీపీ నేతలు హైజా క్ చేస్తున్నారు. యూరియా పంపిణీ విషయంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు (వీఏఏ) ఎంత ఒత్తిళ్లకు గురయ్యారో ఇటీవల జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు చెల్లించకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యంతో యూరియా ఎలా తీసుకెళ్లారో వారు ధర్నా చేసి మరీ వివరించారు.
జిల్లాకు 51 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా అవసరం కాగా 25 వేల మెట్రిక్ టన్నుల లోపే రావడంతో కొరత ఏర్పడింది. వచ్చిన అరకొర యూరియాలో చాలా వరకు టీడీపీ నాయకులు తమ ఇళ్లల్లో దించుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యూరియాను సైతం 50, 100, 150 బస్తాలు చొప్పున టీడీపీ నాయకులు దౌర్జన్యంతో తీసుకెళ్లిపోయారు. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్‌కు ఫోన్లు చేసి, నేరుగా కలిసి, తమకు ప్రత్యేకంగా బస్తాలు దాచాలని చెప్పారంటే జిల్లాలో ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చాలాచోట్ల తలొగ్గాల్సి వచ్చింది. ఎక్కడైతే వ్యతిరేకించారో వారు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, డిప్యుటేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా దారుణమేంటంటే అడ్డగోలుగా తీసుకెళ్లిపోయిన యూరియా బస్తాలకు డబ్బులు కూడా చెల్లించలేదు. ఆ భారాన్ని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ భరించాల్సి వచ్చింది. అసలే వారికి అరకొర జీతాలు, ఆపైన యూరియా సొమ్ము సొంతంగా చెల్లింపులు వెరసి ఆర్థికంగా నష్టపోయారు.
నిదర్శనాలు ఇవే..
● కరగాం పంచాయతీ టీడీపీ నాయకుడు పంగ బావాజీ మొదట విడతగా 45బస్తాలు
టీడీపీ నేతల ఇళ్లకు చేరుతున్న యూరియా
యూరియా కోసం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లపై తీవ్ర ఒత్తిళ్లు
తప్పని పరిస్థితుల్లో తలొగ్గిన వీఏఏలు
మాట వినని వీఏఏలపై కక్ష సాధింపు చర్యలు
డబ్బులు సైతం ఇవ్వకుండా యూరియా బస్తాలు తీసుకెళ్లిపోయిన దుస్థితి
మానసికంగా, ఆర్థికంగా క్షోభకు గురవుతున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు
తీసుకెళ్లారు. రెండో విడతగా రైతులకు ఇస్తానని మరో 50 బస్తాలు తీసుకెళ్లిపోయారు. వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏ రకంగా ఇచ్చారని స్థానిక టీడీపీ కార్యకర్తే వ్యతిరేకించారు. వీవీఏను నిలదీశారు. జాయింట్ డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇచ్చామని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సమాధానం ఇచ్చారు.
రణస్థలం మండలంలో రావాడ, రణస్థలం పంచాయతీలో యూరియా పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో, వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకుండా పంచాయతీలో ఉన్న రైతుల్ని పక్కన పెట్టి పక్క జిల్లా షాపులకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి.
సంచాం పంచాయతీలో యూరియా పంపిణీ సమయంలో మహిళా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్‌పై దుర్భాషలు, పరుషపదజాలం వాడి ఉద్యోగికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి కలిగించడం వల్ల ఆ ఉద్యోగి మెడికల్ లీవ్‌కు వెళ్లే పరిస్థితి వచ్చింది.