
వ్యవసాయ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఆమదాలవలస : ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 15వ తేదీన గుంటూరులోని లామ్ ఫారంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీపాన నీలవేణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికార వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అసలు రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు సైతం 10వ తరగతి పాస్ అయి ఉంటే హాజరు కావచ్చున ని తెలిపారు. పూర్తి వివరాలకు 77023 94824 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.