
పలాస డిగ్రీ కళాశాలకు యునిసెఫ్ గుర్తింపు
పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు జె.వెంకటలక్ష్మి చెప్పారు. కళాశాలలో శుక్రవారం జరిగిన స మావేశంలో ఆమె మాట్లాడుతూ 2024–25 విద్యాసంవత్సరంలో లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రొగ్రాంలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు గాను ఈ గుర్తింపు లభించిందన్నారు. పలాసను రాష్ట్ర స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఈ ప్రాజె క్టు కింద ఎంపికై న 30 మంది విద్యార్థులకు ప్రథమ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన డాక్టరు నారాయణ, భరత్ గుప్తా, డాక్టరు సి.కృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, ఎంఈఓ శ్రీనివాసరావు, ఆర్.అప్పారావు, జె.శంకర్, జి.గొల్ల, దీపకుమారి అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎంపీడీఓలుగా పదోన్నతి
శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, నాణ్యమైన సేవలను అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. జెడ్పీ బంగ్లాలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో డిప్యూటీ ఎంపీడీఓ/పరిపాలనాధికారులుగా పనిచేస్తున్న పలువురు ఉద్యో గులకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీరికి నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు అందుకున్నవారిలో జె.ఆనందరావు, (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ, కోటబొమ్మాళి)ను రాజాం ఎంపీడీఓగా, టి.రాజారావు (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ నందిగాం)ను వంగర మండలం ఎంపీడీఓగా, ఎస్.వసంతకుమారి (డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీపీ కొత్తూరు)ను భామిని ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. నూతన అధికారులు జెడ్పీ చైర్‌పర్సన్‌ను సత్కరించారు. మంచి సేవ లు అందించి అధికారులు, ప్రజల మన్ననలు అందుకోవాలని ఈ సందర్భంగా పిరియా విజయ ఆకాంక్షించారు.
ముగిసిన కళా ఉత్సవం పోటీలు
గార: వమరవల్లి డైట్‌లో గత రెండు రోజులుగా జరిగిన కళా ఉత్సవం–2025 పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. రెండో రోజు నిర్వహించిన పోటీల్లో థియేటర్ విజిల్ ఆర్ట్స్ విభాగంలో కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్, విజువల్ ఆర్ట్స్ త్రీడీ అండ్ టూడీ విభాగంలో కవిటి హైస్కూల్, ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ప్రథమ స్థానంలో నిలిచాయి. వీరికి డిప్యూటీ డీఈఓ ఆర్. విజయకుమారి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌరిశంకర్, నోడల్ అధి కారి తడేల వెంకటరావు పాల్గొన్నారు.
బకాయిలను తక్షణమే చెల్లించాలి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపడుతున్న నిరసన వారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి మెమో నంబర్ 57ను తక్షణమే అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమీషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమోండ్ చేశారు. అలాగే ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమీ కమిటీ సెల్ కన్వీనర్ ఎల్.కరుణాకర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.

పలాస డిగ్రీ కళాశాలకు యునిసెఫ్ గుర్తింపు

పలాస డిగ్రీ కళాశాలకు యునిసెఫ్ గుర్తింపు