
కోళ్ల వ్యాన్ బోల్తా
● కోళ్లు తీసుకెళ్లేందుకు ఎగబడిన జనం
టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీప జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున కోళ్ల లోడు తో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిశా నుంచి కోళ్ల లోడ్‌తో టెక్కలి మీదుగా బొబ్బి లి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ టెక్కలి సమీప జగతిమెట్ట వద్దకు వచ్చే సరికి టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ అమిర్ భాషాకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైవే సిబ్బంది కోళ్ల వ్యాన్‌ను పక్కకు తీశారు. వ్యాన్‌లో దాదాపు 1400 కోళ్లు ఉండగా అందులో సగానికి పైగా మృతిచెందాయి. దీంతో ఆ చనిపోయిన కోళ్ల కోసం చుట్టు పక్కల ప్రాంతాల వారు ఎగబడ్డారు. ఎవరికి దొరికిన కోళ్లను వారు తీసుకెళ్లిపోయారు. మృతి చెందిన కోళ్ల విలువ రూ.లక్షల్లో ఉంటుందని యజమాని తెలిపారు.
టమాటా లారీ బోల్తా
రణస్థలం: లావేరు మండలంలోని రావివలస సమీపంలో జాతీయ రహదారి–16పై శుక్రవారం తెల్లవారుజామున టమాటా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు గాయాలు కావడంతో 108పై శ్రీకాకుళం తరలించారు. రహదారికి అడ్డంగా లారీ పడిపోవడంతో గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

కోళ్ల వ్యాన్ బోల్తా