
థర్మల్ ప్లాంట్‌పై సమర శంఖం
● బలవంతపు భూసేకరణ ఆపాలి
● తీర్మానం చేసిన పోరాట అఖిల పక్ష కమిటీ
సరుబుజ్జిలి/బూర్జ: థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు హెచ్చరించారు. మండలంలోని వెన్నెలవలస థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని, మన జిల్లాలోనూ పవర్ ప్లాంట్, కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో వేలాది ఎకరాలు కార్పొరేట్లకు అప్పగించేందుకు చూస్తోందని వెల్లడించారు. రైతుల అనుమతులు లేకుండా డ్రోన్ సర్వేలు చేయడం చట్ట వ్యతిరేకమని రైతుకూలీ సంఘం అధ్యక్షుడు వంకల మాధవరావు అన్నారు. థర్మల్ ప్లాంట్ కడితే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చి సాగుభూములను బీడు భూములుగా మారుస్తారని న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు వెల్లడించారు. పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నేరడి వద్ద బ్యారేజీ కడితే రూ.13వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మో హనరావు వివరించారు. ఆమదాలవలసపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ని మ్మక అప్పన్న డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ అడ్డుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కంఠ అప్పలనాయుడు హెచ్చరించారు. అఖిల పక్ష సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.