
ఉద్యోగం చేయాలంటే భయమేస్తోంది
● డీఆర్‌డీఏ పీడీని కలిసిన ఏపీఎంలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఆర్‌డీఏ వెలుగులో మండల స్థాయిలో ఏపీఎం క్యాడర్‌లో ఉద్యోగాలు చేయడం కత్తి మీద సాములా మారిందని, రాజకీయ నాయకులు వారి అనుచరుల నుంచి దాడు లు, ఇబ్బందులు వస్తున్నాయని, రక్షణ కల్పించా లని వెలుగు ఏపీఎంల సంఘం ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఇటీవల కొత్తూరు ఏపీఎం ఎ.లలితపై కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. అధికారుల సూచనలతో సేవలు అందిస్తున్నా రాజకీయ ఒత్తిళ్లు భరించలేకపోతున్నామని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, అరెస్టు చేసేలా చూడాలని కోరారు. అన్ని పనులు చేస్తు న్నా, కొంతమంది నాయకులు కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కొత్తూరుకు చెందిన వెలుగు సిబ్బందితో రహస్య సమావేశాలు పెడుతున్నారని, దీన్ని నివారించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో ఏపీఎంల జిల్లా అధ్యక్షుడు సనపల ప్రసాద్, ఏపీఎంలు జాంబవతి, ఉమ, సుశీల, రజిని, లక్ష్మి, విజయకుమారి, లక్ష్మి, గోవిందు, ప్రసాద్, కూర్మారావు, మనోరత్నం, హేమ సుందర్, రాజారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.