
‘చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలి’
ఇచ్ఛాపురం: దళితుల్లో రిజర్వేషన్లు సృష్టించి మాలలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గుణపాఠం చెప్పాలని రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వాహకులు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెన్న కేశవులు అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కు శుక్రవారం ఇచ్ఛాపురంలో ముగింపు పలికారు. పట్టణంలో మెయిన్ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు యాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో గల బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాష్ట్రంలో 42 లక్షల మంది మాలలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న కక్షతో రాష్ట్రంలో రిజర్వేషన్లను ఏర్పాటుచేసి మాలలకు సామాజికంగాను, ఉద్యోగపరంగా చా లా అన్యాయం చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సల్లా దేవరాజ్, నూతలపాటి బాబురావు, నగిరి మోహన్‌రావు, పందిరి లోకేష్, రామారావు, వెంకటరావు, గువ్వాడ దిలీప్, డి.వాసు, బా గ నగేష్, బాగ వేణు, కొప్పల హేమంత్, ప్రియ, తులసీ తదితరులు పాల్గొన్నారు.