ఆంక్షల సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల సంకెళ్లు

Sep 10 2025 10:04 AM | Updated on Sep 10 2025 10:04 AM

ఆంక్ష

ఆంక్షల సంకెళ్లు

రైతు కోసం.. మేము సైతం నరసన్నపేటలో ఉద్రిక్తత

అన్నదాతలతో కలిసి గర్జించిన

వైఎస్సార్‌సీపీ నేతలు

గృహ నిర్బంధాలు, అరెస్టులు

లెక్కచేయకుండా నిరసన

ఎరువుల సమస్య తీరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక

అడుగడుగునా ఆంక్షలు.. అడుగు బయట పెట్టనీయకుండా నిర్బంధాలు.. నలుచెరగులా పోలీసు బలగాలు.. అయినా అన్నదాతల నినాదం దిక్కులు పిక్కటిల్లేలా అందరికీ వినిపించింది. వారి ఆందోళన పాలకుల పీఠాలు కదిలే స్థాయిలో జరిగింది. రైతన్నకు జత కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు ఎరువుల కొరతపై ప్రభుత్వాన్ని దునుమాడారు. నిర్లక్ష్యపు పాలనను అధికారులకు వినతి పత్రాలు అందజేసి మరీ వివరించారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

వైఎస్సార్‌సీపీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరుబాటకు సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. పోలీసు సాయంతో ఆందోళన అణచివేయాలని అనుకుంది. కానీ రైతుల కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. అన్నదాతలు కలిసి రావడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు.

ముందు అనుమతి ఇచ్చి..

సోమవారం రాత్రి 9 గంటల వరకు వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు బాటకు అనుమతులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతో ప్రభుత్వం కుట్రలు పన్నడం ప్రారంభించింది. అనుమతులు తూచ్‌ అంటూ రద్దు చేసేసింది. కేవలం 15 మందితో మా త్రమే వినతి పత్రం ఇచ్చుకోవాలని, ర్యాలీలు, నిరసనలు నిషేధమని ఆంక్షలు విధించింది. తెల్లారే సరికి ఆటంకాలు సృష్టించింది. నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పో లీసుల బలగాలతో మోహరించింది. కానీ నిర్బంధాలను ఛే దించుకుని వైఎస్సార్‌సీపీ నేత లు పోరుబాటను విజయ వంతంగా నిర్వహించారు.

కాశీబుగ్గలో ఉద్రిక్తత

కాశీబుగ్గలో తెల్లవారుజామున నుంచి ఉద్రిక్త పరిస్థి తి చోటు చేసుకుంది. పోలీసుల నిర్బంధాలు దాటుకుని రకరకాల మార్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్నదాతలు కాశీబుగ్గ తరలివచ్చారు. కానీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును గృహ నిర్బంధం చేశారు. దీంతో వాగ్వాదం జరి గింది. అనంతరం పోలీసులు కొందరిని బలవంతంగా వాహ నం ఎక్కించి ఆర్డీఓ ఆఫీస్‌కు తరలించారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నాక సీదిరి అప్పలరాజు తో పాటు పార్టీ పార్లమెంట్‌ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్‌) దుంపల రామారావు, రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్‌) శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తదుపరి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కవిటి మండలంలో వారి ఇళ్ల వద్ద జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు వారి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు.

టెక్కలిలో నిర్బంధాలు..

టెక్కలి వైఎస్సార్‌ జంక్షన్‌ సమీపంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ను పోలీసులు నిర్బంధించారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆర్డీవో కార్యాలయం వద్దకు వాహనంలో తరలించా రు. దీంతో వైఎస్సార్‌ జంక్షన్‌లో కార్యకర్తలు నినాదాలు చేయగా వా రిని అరెస్టు చేశారు. ఆర్డీవో కా ర్యాలయం వద్ద పార్టీ పార్లమెంట్‌ పరిశీలకులు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, సమన్వయకర్త పేరాడ తిలక్‌ తదితరులు వినతి పత్రం అందజే శారు. అంతకుముందు పాతప ట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని, మిగతా నాయకుల ను గృహ నిర్బంధం చేశారు.

నరసన్నపేటలో ఆంక్షలు

నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, ఎంపీపీ ఆరంగి మురళీలతో పాటు పలువురిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఆ తర్వాత కృష్ణదాస్‌కు, కుంభా రవిబాబుకు అనుమతి ఇచ్చారు. 11 గంటలకు జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య పార్టీ కార్యాలయానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు, రైతులు ఒక్క సారిగా చేరారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పూల మాల వేసి ధర్నా నిర్వహించారు. అక్కడే కృష్ణ చైతన్యతో రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్‌) కరిమి రాజేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల్ని అరెస్టు చేశారు. తర్వాత విడుదలైన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

ఎచ్చెర్లలో..

రణస్థలం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తున్న మా జీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, రైతులను పోలీసులు అడ్డగించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను సైతం ఎక్కడికక్కడ నిర్బంధించారు. చివరికి కొద్దిమందితో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.

ఆమదాలవలసలో..

ఆమదాలవలసలో పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను తొలుత ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసు లు నిర్బంధించారు. అనంతరం రైతులతో కలిసి త హసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతి అందజేశారు.

తమ్మినేని ఇంటి వద్ద ఉద్రిక్తత

టెక్కలిలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన మాజీ స్పీకర్‌, పార్లమెంట్‌ సమన్వయకర్త తమ్మినేని సీతారాంను ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

శ్రీకాకుళంలో అడ్డంకులు

శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మో హరించారు. వారిని తప్పించుకుని ఆర్డీవో ఆఫీస్‌కు వచ్చి రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ జోన్‌ ప్రెసిడెంట్‌ గొండు రఘురాం, ధర్మాన రామ్‌ మనోహర్‌నాయుడు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ మోకళ్ల తాతబాబు, ఎచ్చెర్ల శ్రీధర్‌ బాబు వినతి పత్రం అందజేశారు.

నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు

ప్రజా ఉద్యమాలను గృహ నిర్బంధాలతో ఆప లేరు. పాలన చేయలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు. రైతులు గంటల తరబడి యూరియా కోసం వేచి ఉండడం దారుణం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.

– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌

ఎప్పుడూ నిర్లక్ష్యమే..

నాల్గో సారి సీఎంగా గద్దెనెక్కిన చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులన్నా ఎప్పుడూ నిర్లక్ష్యమే. ఒక రోజు వ్యవసాయం దండగ అంటారు. మరో రోజు యూరియా అవసరం లేదంటారు. ఇంకోరోజు కొద్దిగా యూరియా సరిపోతుందంటారు. 15 రోజుల్లో వేయాల్సిన ఎరువు ఇప్పటికీ ఇవ్వకపోతే పంట ఏమైపోతుందోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. యూరియా కేవలం టీడీపీ వాళ్లకే దొరుకుతోంది. మిగిలిన వారు కూడా రైతులే అన్న సంగతి గుర్తించాలి.

– ధర్మాన కృష్ణదాస్‌,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రైతుల కన్నీరు గుర్తించాలి

ప్రభుత్వం రైతుల కన్నీరు చూడాలి. యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. పల్లెల్లో ఎరువు పసుపు కండువా వేసుకున్న వారికే అందుతోంది. సీఎం ఫొటో మాత్రమే చంద్రబాబుది.. అధికారాలు మాత్రం లోకేష్‌వి. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో లేరో తెలీని పరిస్థితి. ఆ శాఖకు పూర్తిగా తాళాలు వేసేశారు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

చంద్రబాబువి చేతకాని మాటలు

జిల్లాకు 32 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరంగా కాగా 37 శాతం కూడా పంపిణీ చేయలేదు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. రైతులకు ఎరువులు ఇవ్వలేక చెబుతున్న చేతకాని మాటలివి. – కుంభా రవిబాబు,

పార్టీ పార్లమెంట్‌ పరిశీలకుడు

నరసన్నపేటలో

రైతు నిరసన

ఆంక్షల సంకెళ్లు1
1/6

ఆంక్షల సంకెళ్లు

ఆంక్షల సంకెళ్లు2
2/6

ఆంక్షల సంకెళ్లు

ఆంక్షల సంకెళ్లు3
3/6

ఆంక్షల సంకెళ్లు

ఆంక్షల సంకెళ్లు4
4/6

ఆంక్షల సంకెళ్లు

ఆంక్షల సంకెళ్లు5
5/6

ఆంక్షల సంకెళ్లు

ఆంక్షల సంకెళ్లు6
6/6

ఆంక్షల సంకెళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement