
నదిలో దూకిన బాలుడు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కొత్త వంతెన పై నుంచి ఓ బాలుడు నాగావళి నదిలో దూకేసిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపిన వివరా ల్లోకి వెళ్తే.. నగరంలోని రెల్లివీధికి చెందిన బి.రమేష్ అంబేడ్కర్ జంక్షన్ వద్ద పళ్ల రసం దు కాణం నడుపుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఓ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే యూనిఫాం ధ రించి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి సరిగ్గా ఉదయం 9:15 గంటలకు డేఅండ్‌నైట్ సమీప కొత్త వంతెన పైనుంచి దూకేశాడు. దీన్ని గమనించిన ఏఆర్ కానిస్టేబుల్ అగ్నిమాపక శాఖకు సమా చారం అందించారు. విద్యార్థి తేలియాడుతూ కనిపించడంతో అటువైపుగా వెళ్తున్న పాలవ్యాపారి తన వద్దనున్న తాడు వేయడం, అప్పటికీ సరిపోకపోవడంతో ఓ జాలరి తన వద్ద నున్న తాడు కలిపి వేయడంతో బాలుడు అందుకున్నాడు. అప్పటికే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సైతం జాలరితో పాటు నదిలోకి దిగి బాలున్ని రక్షించి బయటకు క్షేమంగా తీశారు. ఈలోగా తల్లిదండ్రులు రావడంతో కౌన్సిలింగ్ చేశామని, చిన్న కారణానికే క్షణికావేశంలోనే బాలుడు నదిలో దూకాడని ఏడీఎఫ్‌ఓ శ్రీనుబాబు పేర్కొనడం విశేషం. అదే మార్గంలో బాలున్ని చూసేందుకు వాహనదారులు అధికంగా ఆగడంతో కాసేపు ట్రాఫిక్ అయ్యింది.