
తాయిలాల కోసం తోపులాట
తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలకు ఇచ్చే తాయిలాల కోసం తోపులాట జరిగింది. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో గల ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన సీ్త్ర శక్తి కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభకు వస్తే తాయిలాలు ఇస్తామని చెప్పడంతో మహిళలు తరలివచ్చారు. వారికి జాకెట్ పీస్‌లు ఇస్తుండటంతో సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారి చేరడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం కల్పించామన్నారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్లకు, మహిళలకు ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్‌కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైడిశెట్టి జయంతి, మాదారపు వెంకటేషు తదితరులు పాల్గొన్నారు.