
కుల సంఘాలు సమాజసేవ చేయాలి
నరసన్నపేట: కుల సంఘాలు సమాజ సేవలో ముందుండాలని కళింగ కోమట్లు సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధి, కళింగకోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిన రమేష్ అన్నారు. నరసన్నపేటలోని ఓ కన్వెన్షన్ హాలులో జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కళింగ కోమట్లు రాష్ట్ర సంఘం ప్రతినిధి బోయిన గోవిందరాజులు, జిల్లా సంఘం ప్రతినిధి తంగుడు జోగారావు తదితరులు మాట్లాడుతూ కళింగ కోమట్ల అభివృద్ధే ధ్యేయమన్నారు. కాగా, జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక వాయిదా పడింది. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు జోగారావు తెలిపారు. కార్యవర్గం ఎన్నికకు గోవిందరాజులు అధ్యక్షతన మరో 8 మందితో కూడిన కమిటీని నియమించామని చెప్పారు.
నిందితులను కఠినంగా
శిక్షించాలి
ఇచ్ఛాపురం : విశాఖపట్నం సీతమ్మధారలో మూగబాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్–1 ఉలాల భారతి దివ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నేరస్తులను వెంటనే పట్టుకుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.

కుల సంఘాలు సమాజసేవ చేయాలి